Ananth Technologies: సీఎంఎస్‌-03 ఉపగ్రహ ప్రయోగంలో అనంత్‌ టెక్నాలజీస్‌దీ పాత్ర

Eenadu icon
By Business News Desk Updated : 03 Nov 2025 03:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఎల్‌వీఎం3-ఎం5 వాహక నౌక ద్వారా సీఎంఎస్‌-03 ఉప్రగహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించిందని అనంత్‌ టెక్నాలజీస్‌ ఛైర్మన్‌ సుబ్బారావు పావులూరి తెలిపారు. ఈ సమాచార ఉపగ్రహ ప్రయోగంలో తమ సంస్థ భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. ఎల్‌వీఎం3-ఎం5 వాహక నౌక కౌసం కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌ మాడ్యూల్స్, నేవిగేషన్‌ సిస్టమ్స్, ఎలక్ట్రో- మెకానికల్‌ యాక్టుయేటర్‌ సిస్టమ్స్‌ లాంటి కీలక వ్యవస్థలను అందించామని కంపెనీ వెల్లడించింది. సీఎంఎస్‌-03 ఉపగ్రహానికి అవసరమైన పవర్‌ కంట్రోల్‌- పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్, టెలిమెట్రీ- టెలికమాండ్‌ సిస్టమ్స్, స్టార్‌ సెన్సర్‌ లాంటివి అనంత్‌ టెక్నాలజీస్‌కు చెందిన యూనిట్లలో తయారైనట్లు పేర్కొంది.

Tags :
Published : 03 Nov 2025 03:03 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు