iPhone 17 series: ఈసారి ఐఫోన్‌ 17 సిరీస్‌ ధరల పెంపు..! ఎంత ఉండొచ్చంటే..?

Eenadu icon
By Business News Team Published : 29 Aug 2025 11:49 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 17 సిరీస్‌ (iPhone 17 series) ఫోన్లు సెప్టెంబర్‌ 9న లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌లో నాలుగు మోడల్స్‌ రానున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ఎయిర్‌, ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ఉండనున్నట్లు సమాచారం. అయితే.. గతంతో పోల్చితే ఈసారి వచ్చే మోడళ్లలో భారీ అప్‌గ్రేడ్‌లు ఉంటాయని.. ఈ కారణంగా ధరల పెరుగుదలకు అవకాశముందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇటీవల ఐఫోన్‌ 17, ఐఫోన్‌ 17 ప్రో మోడళ్ల అమెరికా ధరలు లీకయ్యాయి. దాదాపు 50 డాలర్ల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సిరీస్‌లో వచ్చే ఫోన్లు మరింత ఖరీదు కానున్నట్లు సమాచారం. లీకైన వివరాలను బట్టి ఐఫోన్‌ 17 సిరీస్‌ ధరలు ఎంత ఉండొచ్చంటే..?

  • ఐఫోన్‌ 17 128జీబీ వేరియంట్‌ ధర ఈసారి $849 లేదా ₹84,990 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
  • గత ఐఫోన్‌ 16ప్రో ధర $999 గా ఉండగా.. ఈసారి ఐఫోన్‌ 17 ప్రో ధర $1,049 లేదా ₹1,24,990 ఉండనున్నట్లు సమాచారం.
  • ఇక ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ధర $1,249 లేదా ₹1,50,000కు పెరగవచ్చని సమాచారం.

అయితే ఈ ధరలపై యాపిల్‌ (Apple) సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌ ఈవెంట్‌ సెప్టెంబర్‌ 9న రాత్రి 10.30 గంటలకు ఉండనుంది. దీనిని Apple.com, Apple TVలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు