Delhi Airport: దిల్లీ విమానాశ్రయంలో ఏటా 13 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు

Eenadu icon
By Business News Desk Published : 28 Oct 2025 03:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ) ప్రస్తుతం ఏడాదికి 10 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేందుకు అనువుగా ఉంది. భవిష్యత్తులో 13 కోట్ల మందికి సేవలందించేలా విస్తరిస్తామని విమానాశ్రయ నిర్వహణ సంస్థ దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సీఈఓ విదేహ్‌ కుమార్‌ జైపురియార్‌ వెల్లడించారు. ఈ విమానాశ్రయం గత ఆర్థిక సంవత్సరంలో 7.93 కోట్ల ప్రయాణికులకు సేవలు అందించింది. ‘టెర్మినల్‌ 1 సామర్థ్యం 4.4 కోట్ల మంది ప్రయాణికులు కాగా, ఇటీవల పునఃప్రారంభించిన టీ2 ఏటా  1.5 కోట్ల మందికి సేవలు అందిస్తుంది. అంతర్జాతీయ సర్వీసులు నడిచే టెర్మినల్‌3 (టీ3) సామర్థ్యం 3.4 కోట్లే అయినా, 5.1 కోట్ల మందికి సేవలందించాం. మరో 1.2 కోట్ల మందికి సేవలందించేలా ఈ టెర్మినల్‌ సామర్థ్యం పెంచనున్నాం’ అని తెలిపారు.

టీ3 నుంచి టీ1కు సామగ్రి బదిలీ సులభం

అంతర్జాతీయ ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు టీ3 నుంచి టీ1కు వారి సామగ్రిని నేరుగా బదిలీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని జైపురియార్‌ తెలిపారు. విదేశాల నుంచి వచ్చి, దేశీయ విమానాల్లో గమ్యస్థానం చేరేందుకు టీ1కు ప్రయాణికులు వెళ్తుంటారు. కస్టమ్స్‌ తనిఖీల అనంతరం, వీరు తమ లగేజీని టీ3లోని ప్రత్యేక కౌంటర్‌లో అప్పగించవచ్చు. సిబ్బందే ఆ లగేజీని టీ1కు తరలిస్తారు. దీనివల్ల ప్రయాణికులు శ్రమ లేకుండా ఒక టెర్మినల్‌ నుంచి మరో టెర్మినల్‌కు తేలిగ్గా ప్రయాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని