Department of Telecommunication: రెండు కోట్లకుపైగా ఫోన్‌ కనెక్షన్లు బ్లాక్‌: డీవోటీ

Eenadu icon
By Business News Team Published : 03 Sep 2025 18:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న దాదాపు రెండు కోట్లకుపైగా ఫోన్‌ కనెక్షన్లను బ్లాక్‌ చేసినట్లు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) కార్యదర్శి నీరజ్ మిత్తల్ తెలిపారు. సంచార్ సాథీతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసినట్టు వెల్లడించారు. దక్షిణ గోవాలో డీవోటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన వీడియో మాధ్యమంలో ప్రసంగించారు. దేశ సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు డీవోటీ అనేక చర్యలు చేపట్టిందన్నారు.

‘‘ప్రతి రంగంలో టెలికాం (Telecom) పాత్ర పెరిగింది. వినియోగదారుల సంఖ్య పెరిగినట్లే.. ఆర్థిక రంగంలో టెలికాం వనరుల దుర్వినియోగం కూడా పెద్దఎత్తున నమోదవుతోంది. ఈ క్రమంలోనే ఆర్థిక రంగంలో జరుగుతున్న మోసాల గురించి సమాచారాన్ని సేకరించడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఆర్థిక సంస్థలకు ఉపకరించే డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను డీవోటీ అభివృద్ధి చేసింది. ఇది సైబర్ సురక్షిత వాతావరణాన్ని అందిస్తుంది’’ అని మిత్తల్‌ తెలిపారు.

సంచార్‌ సాథీ.. ఫిర్యాదు ఇక సులభం

‘‘అధిక నాణ్యత కలిగిన టెలికాం పరికరాలను అందుబాటులో ఉంచేందుకు.. టెలికాం టెస్టింగ్‌ ల్యాబ్‌లను పెంచుతున్నాం. కృత్రిమ మేధ సాయంతో మోసపూరిత కనెక్షన్లను తొలగిస్తున్నాం. సైబర్‌ భద్రత విషయంలో ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన ‘ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌’.. మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే ఫోన్‌ నంబర్లను విజయవంతంగా గుర్తిస్తోంది. డీవోటీ కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థనూ అప్‌గ్రేడ్ చేయనున్నాం’’ అని మిత్తల్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు