Tesla – Grok: టెస్లా కార్లలో గ్రోక్‌.. త్వరలో అందుబాటులోకి: ఎలాన్‌ మస్క్‌

Eenadu icon
By Business News Team Published : 11 Jul 2025 00:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Tesla – Grok | ఇంటర్నెట్ డెస్క్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ తన అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ’ అభివృద్ధి చేసిన గ్రోక్‌ ఏఐని త్వరలో టెస్లా వాహనాలకూ అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే వారం నుంచే టెస్లా కార్లలో గ్రోక్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఫుల్‌ సెల్ఫ్ డ్రైవింగ్‌ టెస్లా కార్ల వినియోగదారులకు గ్రోక్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. టెస్లా, ఎక్స్‌ఏఐ, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ వంటి తన కంపెనీలను ఏఐ-ఆధారిత వ్యవస్థ కింద ఏకీకృతం చేయాలనే మస్క్‌ ఆలోచనకు ఇది అనుగుణంగా ఉండనుంది.

టెస్లా వాహనాల్లో గ్రోక్‌ హ్యాండ్స్‌-ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. మ్యాప్స్‌, ట్రాఫిక్ పరిస్థితుల గురించి డ్రైవర్లు అడిగే ప్రశ్నలకు గ్రోక్‌ రియల్‌-టైమ్‌లో సమాధానాలు ఇస్తుంది. కారులో సహజమైన పరస్పర సంభాషణను అందించటానికి దీనికి శిక్షణ ఇస్తున్నారు. ఇది టెస్లాలో ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉండడం వల్ల వేరే ఇతర యాప్‌లపై గానీ, పరికరాలపై గానీ ఆధారపడాల్సిన అవసరం లేదు.

అసలేంటీ గ్రోక్‌?

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని కృత్రిమ మేధ అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాటే గ్రోక్‌. చాట్‌జీపీటీ తరహాలో ఇది పనిచేస్తుంది. 2023లో అందుబాటులోకి వచ్చిన ఈ ఏఐ.. ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. ఇది ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో తాజా సమాచారాన్ని సైతం అందిస్తోంది. మ్యాథ్స్‌, కోడింగ్‌ వంటి అకడమిక్‌ పరీక్షల్లోనూ మెరుగైన సమాధానాలు ఇస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు