petrol sales: పెట్రోలు విక్రయాలకు పండగ జోష్
అక్టోబరులో 5 నెలల గరిష్ఠానికి డీజిల్ విక్రయాలు స్తబ్దుగా

దిల్లీ: పండగ సమయంలో ప్రయాణాలు పెరగడంతో అక్టోబరులో పెట్రోల్ అమ్మకాలు 5 నెలల గరిష్ఠానికి చేరాయి. అయితే ఇందుకు భిన్నంగా డీజిల్ వినియోగంలో స్తబ్దత కొనసాగిందని ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. పెట్రోలియమ్, సహజవాయువు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ నెలవారీ నివేదిక ప్రకారం...
- పెట్రోల్ వినియోగం గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ అక్టోబరులో 7 శాతం పెరిగి 36.5 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబరులో నమోదైన 34 లక్షల టన్నులతో పోలిస్తే కూడా అక్టోబరులో పెట్రోల్ విక్రయాలు పెరిగాయి. 2023 అక్టోబరుతో చూసినా పెట్రోల్ వినియోగం 16.3 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి 7 నెలల్లో పెట్రోల్ వినియోగం 6.8 శాతం పెరిగి 248.40 లక్షల టన్నులకు చేరింది.
 - దేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనమైన డీజిల్ విక్రయాలు అక్టోబరులో పెద్దగా మార్పులేకుండా 76 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. 2024 అక్టోబరులోనూ డీజిల్ విక్రయాలు 76.40 లక్షలు టన్నులుగా ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం కావడంతో జూన్‌లో డీజిల్ వినియోగం తగ్గుతుంది. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ వినియోగం పుంజుకుంటుంది. పండగ సీజను కానుండటం ఇందుకు కలిసివస్తుంది. అయినప్పటికీ ఈసారి అక్టోబరులో డీజిల్ విక్రయాలు స్తబ్దుగా ఉండటం గమనార్హం. 2023 అక్టోబరులోని 76.3 లక్షల టన్నుల కంటే కూడా 2025 అక్టోబరులో డీజిల్ గిరాకీ తక్కువగా నమోదైందని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో ఈ ఇంధన విక్రయాలు 2.45 శాతం పెరిగి 533 లక్షల టన్నులుగా ఉందని నివేదిక వివరించింది.
 - కిందటేడాది అక్టోబరుతో పోలిస్తే విమాన ఇంధన (ఏటీఎఫ్) వినియోగం ఈ అక్టోబరులో 1.6 శాతం పెరిగి 7,69,900 టన్నులకు చేరింది. 2023 అక్టోబరుతో పోలిస్తే కూడా ఏటీఎఫ్ విక్రయాల్లో 11.11 శాతం పెరుగదల ఉంది.
 - ఎల్పీజీ విక్రయాలు కూడా 5.4 శాతం పెరిగి 30 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్‌రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్‌కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్‌జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


