సంక్షిప్తవార్తలు (7)
8% తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) సెప్టెంబరు త్రైమాసికంలో రూ.4,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.5,328 కోట్ల కంటే ఇది 8% తక్కువ. ఆదాయం కూడా రూ.35,445 కోట్ల నుంచి రూ.35,026 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం మాత్రం రూ.30,278 కోట్ల నుంచి రూ.31,511 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.11,637 కోట్ల నుంచి రూ.11,954 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) సెప్టెంబరు చివరికి 2.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలూ 0.57 శాతానికి తగ్గాయి. మొండి బాకీలకు కేటాయింపులు రూ. 2,336 కోట్ల నుంచి రూ.1,232 కోట్లకు తగ్గాయి.
బీపీసీఎల్ డివిడెండ్ రూ.7.50
దిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), సెప్టెంబరు త్రైమాసికంలో రూ.6,442.53 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.2,397.93 కోట్లతో పోలిస్తే ఇది 169% అధికం. రిఫైనింగ్ మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.7.5 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
బ్యారెల్ ముడిచమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మార్చడం ద్వారా 10.78 డాలర్లను సంస్థ ఆర్జించింది. 2024 జులై- సెప్టెంబరులో ఇది బ్యారెల్‌కు 4.41 డాలర్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం 3% పెరిగి రూ.1.21 లక్షల కోట్లకు చేరింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో తమ రిఫైనరీలు 111% సామర్థ్య వినియోగంతో 9.82 మిలియన్ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయని, ఏడాది క్రితం ఇది 10.29 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాలు గత త్రైమాసికంలో 2.26% పెరిగి 12.67 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.
నకిలీ ఐటీసీ రాకెట్‌ను ఛేదించిన జీఎస్‌టీ అధికారులు
దిల్లీ: నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసి రూ.31.95 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన కేసును జీఎస్‌టీ అధికారులు ఛేదించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మోసపూరితంగా ఐటీసీని ఒక కంపెనీ పొందుతున్నట్లు సీజీఎస్‌టీ దిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన పన్ను ఎగవేత నిరోధక శాఖ దర్యాప్తులో గుర్తించింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టరును అరెస్టు చేశారు.
క్షీణత బాటలోనే చైనా తయారీ రంగం
చైనా తయారీ రంగ ఉత్పత్తిలో వరుసగా ఏడో నెలా క్షీణత నమోదైంది. ఆ దేశ అధికారిక తయారీ రంగ సూచీ అక్టోబరులో 49 పాయింట్లకు దిగివచ్చింది. అంచనా వేసిన దాని కంటే కూడా ఇది చాలా తక్కువ. సెప్టెంబరులో ఇది 49.8 పాయింట్లుగా ఉంది. చైనాపై సుంకాలను 57% నుంచి 47 శాతానికి తగ్గించనున్నట్లు అమెరికా తాజాగా నిర్ణయించడంతో, చైనా ఎగుమతులు పుంజుకోవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
67% పెరిగిన పతంజలి ఫుడ్స్ లాభం
పతంజలి ఫుడ్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.516.69 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఇదే కాల లాభం రూ. 308.58 కోట్ల కంటే ఇది 67% అధికం. మొత్తం ఆదాయం రూ. 8132.76 కోట్ల నుంచి రూ.9850.06 కోట్లకు పెరిగింది.
విదేశీ మారకపు నిల్వలు తగ్గాయ్
అక్టోబరు 24తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 6.925 బిలియన్ డాలర్లు తగ్గి 695.355 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 4.496 బిలియన్ డాలర్లు పెరిగి 702.28 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.862 బిలియన్ డాలర్లు తగ్గి 566.548 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. పసిడి నిల్వల విలువ 3.01 బిలియన్ డాలర్లు తగ్గి 105.536 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది.
సంక్షిప్తంగా..
- హరిత ఇంధన రంగంలోని ప్రముఖ సంస్థలతో 28 ఒప్పందాలను వి.ఒ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ (ట్యుటికారన్) కుదుర్చుకుంది. ఈ మొత్తం ఒప్పందాల విలువ రూ.1.27 లక్షల కోట్ల వరకు ఉంటుంది.
 - కొత్త తరం ఇంజిన్ల తయారీ నిమిత్తం చెన్నై ప్లాంటులో రూ.3,250 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్ తెలిపింది.
 - రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు స్థిరమైన భవిష్యత్ అంచనాతో బీఏఏ2 రేటింగ్‌ను మూడీస్ కొనసాగించింది. మూలధన వ్యయాల కోసం అధికంగా వెచ్చిస్తున్నా, పటిష్ఠ ఆర్థిక మూలాలు, నిధుల లభ్యత, ఆర్థిక విధాన నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని సంస్థకు ఈ రేటింగ్ కొనసాగిస్తున్నట్లు వివరించింది.
 

Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

న్యూసెలియన్ నుంచి కణ, జన్యు చికిత్సలు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్‌కు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ న్యూసెలియన్ థెరప్యూటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంఛనంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. - 
                                    
                                        

20 ఏళ్లలో 50 రెట్ల వృద్ధి
దేశ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం మార్కెట్ విలువ గత 20 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది. దేశ జీడీపీకి ప్రధాన ఆధారంగా ఇది మారింది. 2005లో రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న బీఎఫ్ఎస్ఐ రంగం మార్కెట్ విలువ, 2025 నాటికి రూ.91 లక్షల కోట్లకు పెరిగింది. - 
                                    
                                        

అనిల్ అంబానీ ఇల్లు సహా రూ.7,500 కోట్ల ఆస్తుల జప్తు: ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ప్రకటించింది. - 
                                    
                                        

రూ.6 లక్షల కోట్ల పండగ విక్రయాలు
దసరా-దీపావళి పండగ సీజన్ అంటేనే ఉద్యోగులకు బోనస్.. ఇంట్లోకి కొత్తగా కొనుగోలు చేయాలనుకున్న వస్తువును తెచ్చుకునేందుకు శుభగడియలుగా ఎక్కువమంది భావిస్తుంటారు. - 
                                    
                                        

2030 కల్లా రూ.26.40 లక్షల కోట్లకు!
మన దేశ బయోఎకానమీ రంగం 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.26.40 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. - 
                                    
                                        

టైటన్ లాభం రూ.1,120 కోట్లు
టైటన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరులో రూ.1,120 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.704 కోట్లతో పోలిస్తే ఇది 59% అధికం. - 
                                    
                                        

రూ.2.25 లక్షల కోట్లు పెరిగిన సంపద
రెండు రోజుల వరస నష్టాలకు తెరదించుతూ సోమవారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగిసింది. వాహన, బ్యాంకింగ్ రంగంలో కొన్ని కంపెనీల షేర్లల్లో కొనుగోళ్లు ఇందుకు ఉపకరించాయి. - 
                                    
                                        

పబ్లిక్ ఇష్యూకు మీషో, షిప్‌రాకెట్
మీషో, షిప్ రాకెట్ సహా 7 కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దరఖాస్తులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ 7 సంస్థలు కలిపి ఐపీఓల ద్వారా మొత్తంగా రూ.7,700 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. - 
                                    
                                        

లెన్స్‌కార్ట్ నుంచి ఏఐ స్మార్ట్ గ్లాసెస్
కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయడానికి కళ్లజోళ్ల సంస్థ లెన్స్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ ఆధారిత లైఫ్‌స్టైల్ బ్రాండ్‌గా ఎదగడానికి, కంపెనీకి ఇది తొలి అడుగని సంబంధిత వర్గాలు తెలిపాయి. - 
                                    
                                        

వొడాఫోన్ ఐడియాలో టీజీహెచ్ రూ.53,000 కోట్ల పెట్టుబడి!
వొడాఫోన్ ఐడియా (వీఐ)లో 4-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000 కోట్లు- 53,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ (టీజీహెచ్) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. - 
                                    
                                        

ఆర్థిక ఫలితాలు
తాజ్‌జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.109 కోట్ల ఆదాయంపై రూ.23.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాలంలో ఆదాయం రూ.107 కోట్లు, నికర లాభం రూ.20 కోట్లుగా ఉన్నాయి. - 
                                    
                                        

సంక్షిప్తవార్తలు ( 5)
టాటా ట్రస్ట్స్ నుంచి తనను తొలగించడాన్ని, మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ వద్ద మెహ్లీ మిస్త్రీ సవాలు చేశారు. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ యాక్ట్, 1950 కింద ఆ రాష్ట్రంలోని ట్రస్టుల కార్యకలాపాలను ఛారిటీ కమిషనర్ పర్యవేక్షిస్తారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 


