పసిడి ప్రతికూలమే!

Eenadu icon
By Business News Desk Published : 03 Nov 2025 03:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కమొడిటీస్‌ ఈ వారం

పసిడి

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,22,890 కంటే ఎగువన చలించకుంటే ప్రతికూల ధోరణి కొనసాగుతుందని భావించవచ్చు. అయితే రూ.1,18,276 వద్ద మద్దతు లభించొచ్చని విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ రూ.1,23,538 కంటే పైకి వెళితే పెరిగే అవకాశం ఉంటుంది. 

వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,41,803 కంటే కిందకు వస్తే రూ.1,35,207; రూ.1,31,109 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రూ.1,52,497 కంటే పైకి వెళితే రూ.1,56,595; రూ.1,63,191 వరకు పెరగొచ్చు. 

ప్రాథమిక లోహాలు

  • రాగి నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.1,004 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రతికూల ధోరణిలో చలిస్తే రూ.997.65 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.984.45; రూ.970.75 వరకు దిగిరావచ్చు. 
  • సీసం నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.183 కంటే దిగువన చలించకుంటే సానుకూల ధోరణి కొనసాగొచ్చు. అందువల్ల ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకొని లాంగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు. 
  • జింక్‌ నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.304.60 కంటే ఎగువన కదలాడకుంటే.. ఈ స్థాయికి పైన స్టాప్‌లాస్‌ పెట్టుకొని షార్ట్‌ సెల్‌ చేయడం మంచి వ్యూహమే అవుతుంది.
  • అల్యూమినియం నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.274.25 కంటే పైన కదలాడకుంటే రూ.271.05; రూ.268.85 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. 

ఇంధన రంగం

  • ముడి చమురు నవంబరు కాంట్రాక్టు ఈవారం రూ.5,325 కంటే దిగువన కదలాడకుంటే షార్ట్‌సెల్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మేలు. రూ.5,511 కంటే పైన కదలాడితే రూ.5,601; రూ.5,714 వరకు పెరుగుతుందని అనుకోవచ్చు. 
  • సహజవాయువు నవంబరు కాంట్రాక్టుకు ఈవారమూ సానుకూల ధోరణి కొనసాగితే రూ.394.45 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.409.20; రూ.451.55 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రూ.333 దిగువన మాత్రమే షార్ట్‌ సెల్లింగ్‌ వైపు మొగ్గు చూపడం మంచిది. 

వ్యవసాయ ఉత్పత్తులు

  • పసుపు డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.14,156 కంటే కిందకు వస్తే రూ.13,422; రూ.12,800 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.15,512 కంటే పైకి వెళితే రూ.16,134; రూ.16,868 వరకు రాణించవచ్చు.
  • జీలకర్ర నవంబరు కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.20,613 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.21,091; రూ.21,583 వరకు పెరుగుతుందని అనుకోవచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.19,643 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.19,151; రూ.18,673 వరకు దిద్దుబాటు అయ్యే అవకాశం ఉంది. 

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు