Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Eenadu icon
By Business News Team Published : 17 Jun 2025 09:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. తొలుత స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టిన స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 190 పాయింట్ల నష్టంతో 81,599 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 73 పాయింట్ల నష్టంతో 24,873 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 73.44 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,399 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ 1.52 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500.. 0.94 శాతం, డోజోన్స్ 0.75 శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.50 శాతం లాభంతో ట్రేడవుతుండగా.. హాంగ్‌సెంగ్‌ 0.25 శాతం, షాంఘై 0.21 శాతం, ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.22 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.2,539 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.5,781 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని