బ్యాంకులకు కొత్త డొమైన్‌.. కొత్త యూఆర్‌ఎల్స్‌ ఇవే!

Eenadu icon
By Business News Team Published : 01 Nov 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా పలు బ్యాంకులు తమ నెట్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైట్లను .bank.in డొమైన్‌కి మార్చుతున్నాయి. సైబర్‌ మోసాలను తగ్గించి డిజిటల్‌ లావాదేవీల భద్రతను పెంపొందించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆదేశాల మేరకు ఈ మార్పును చేపట్టాయి. ప్రస్తుత వెబ్‌సైట్‌ అడ్రస్‌లను అక్టోబర్‌ 31లోపు .bank.in డొమైన్‌కి మార్చాలని ఆర్‌బీఐ ఏప్రిల్ 21న బ్యాంకులను ఆదేశించింది. దీంతో ఇప్పటికే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్‌ వంటి ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కోటక్‌ మహీంద్రా వంటి ప్రైవేట్‌ బ్యాంకులు కూడా కొత్త డొమైన్‌కు మారాయి.

ఈ మార్పుల ద్వారా ఫిషింగ్‌, హ్యాకింగ్‌ వంటి సైబర్‌ నేరాలను తగ్గించి, సురక్షిత ఆర్థిక సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలన్నదే తమ లక్ష్యమని ఆర్‌బీఐ గతంలో తెలిపింది. భవిష్యత్తులో బ్యాంకేతర ఆర్థిక సంస్థల కోసం ప్రత్యేక ‘fin.in’ డొమైన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. తాజా మార్పు వల్ల మీరు ఆయా బ్యాంకుల ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం ప్రయత్నించినప్పుడు యూఆర్‌ఎల్‌లో .bank.in కనిపిస్తుంది. కొన్ని వెబ్‌సైట్లు .comతో కొనసాగుతున్నా.. ఏదైనా కేటగిరీ ఎంపిక చేసినప్పుడు .bank.inతో కూడిన కొత్త డొమైన్‌కు రీడైరెక్ట్ చేస్తున్నాయి.

ప్రముఖ బ్యాంకుల కొత్త డొమైన్‌లు ఇవే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు