Stock market: భారీ లాభాల్లో సూచీలు.. మళ్లీ 24,550 ఎగువకు నిఫ్టీ

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకులు, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 750కి పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో మళ్లీ 24,550 ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 79,885.36 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,857.79) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో స్వల్ప లాభాల్లో కదలాడిన సూచీ.. క్రమంగా భారీ లాభాల్లోకి వెళ్లింది. ఇంట్రాడేలో 80,636.05 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ చివరికి 746.29 పాయింట్ల లాభంతో 80,604.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 221.75 పాయింట్ల లాభంతో 24,585.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.66గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఎటెర్నల్, ట్రెంట్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 66 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 3,362.26 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

900 మంది పైలట్లు సమకూరుతారా!
దేశీయ విమాన ప్రయాణికుల విపణిలో 63% వాటా కలిగిన అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో.. పౌర విమానయాన తాజా నిబంధనల అమలులో విఫలమై, భారీ సంక్షోభాన్ని చవిచూస్తోంది. -

విద్యుత్ పంపిణీ రంగంలో ఏఐ, ఎంఎల్ యాప్‌లు కీలకం
వినియోగదారు-కేంద్రీకృత, తెలివైన, స్వీయ ఆప్టిమైజింగ్ పంపిణీ నెట్‌వర్క్‌లను నిర్మించడంలో కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత అప్లికేషన్లు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్‌లాల్ ఆదివారం వెల్లడించారు. -

రూ.9 లక్షల కోట్లకు ఎస్బీఐ గృహ రుణాలు
ఈ ఏడాది నవంబరులో తమ తనఖా (గృహ) రుణాల విలువ రూ.9 లక్షల కోట్లను అధిగమించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. -

ఒక శ్రేణిలోనే కదలికలు
దేశీయ స్టాక్ మార్కెట్ల కీలక సూచీలు ఈవారం చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈనెల 9-10 తేదీల్లో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరపతి విధాన సమావేశ నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారిస్తారు. -

పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టులో ఈవారం అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఉండటం, ఇప్పటికే పసిడి మోతాదుకు మించి పెరగడం ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు. -

యూబీఎస్‌లో 10,000 ఉద్యోగాల కోత!
స్విస్ బ్యాంక్ యూబీఎస్, 2027 కల్లా 9 శాతానికి సమానమైన 10,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవచ్చని ఒక వార్తా సంస్థ తెలిపింది. -

వేక్ఫిట్లోకి రూ.186 కోట్ల పెట్టుబడులు
ఐపీఓకు ముందే సెకండరీ మార్కెట్ లావాదేవీల ద్వారా వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్లోకి రూ.186 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్టెడ్‌వ్యూ రూ.101 కోట్లు, వైట్ఓక్ రూ.72 కోట్లు, క్యాపిటల్ 2బి రూ.13 కోట్లు పెట్టుబడి పెట్టాయి. -

స్పేస్ఎక్స్లో వాటా విక్రయించడం లేదు
రాకెట్, శాటిలైట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ నిధులు సమీకరించడం లేదని కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. -

బాక్సైట్ తవ్వకాలు 2026లో ప్రారంభిస్తాం
బాక్సైట్ తవ్వకాలను వచ్చే జూన్ కల్లా ప్రారంభిస్తామని నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. -

సంక్షిప్త వార్తలు (4)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 0.25% తగ్గించిన నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) రెపో అనుసంధానిత రుణ రేట్లు (ఆర్ఎల్ఎల్ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2025)
-

బిగ్‌బాస్ సీజన్9: ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేషన్.. టాప్-5లో వీళ్లేనట
-

ఇతరుల కంటే రో-కోను భిన్నంగా చూడాలి: మాజీ బ్యాటింగ్ కోచ్
-

రష్మిక ఫేస్‌పై కలర్స్ ఎందుకు?: రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే
-

బాణసంచాతోనే మంటలా..? గోవా సీఎం ఏం చెప్పారంటే..
-

భారత విదేశాంగ మంత్రిపై పాకిస్థాన్ అక్కసు


