Tesla vs VinFast: టెస్లాకు పోటీగా మరో విదేశీ కంపెనీ.. విన్‌ఫాస్ట్‌ బుకింగ్స్‌ షురూ

Eenadu icon
By Business News Team Published : 15 Jul 2025 14:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Tesla vs VinFast | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ కార్ల మార్కెట్‌లోకి విదేశీ కార్ల కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఎన్నోఏళ్ల ఎదురుచూపుల తర్వాత అమెరికాకు చెందిన టెస్లా (Tesla) దేశంలోకి మంగళవారం  ఎంట్రీ ఇచ్చింది. ముంబయిలో తొలి కార్ల షోరూమ్‌ను ప్రారంభించింది. అదేరోజున మరో విదేశీ కంపెనీ తన ప్రణాళికలను ప్రారంభించింది. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ సంస్థ తన వీఎఫ్‌6, వీఎఫ్‌7 మోడళ్ల      ప్రీ బుకింగ్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఆగస్టులో వీటిని లాంచ్‌ చేయబోతోంది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన రోజే.. మరో విదేశీ కంపెనీ నుంచి టెస్లా ఎదుర్కోవడం గమనార్హం.

ముంబయిలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా.. దేశీయంగా తొలుత ‘మోడల్‌ Y’ ఈవీలను విక్రయించనుంది. ఇందులో బేస్‌ మోడల్‌ ధర రూ.60 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. లాంగ్‌ రేంజ్‌ మోడల్‌ ధర రూ.68 లక్షలుగా నిర్ణయించింది. స్టాండర్డ్‌ వేరియంట్‌ 60KwH బ్యాటరీ కలిగిన కారు సింగిల్‌ ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 75kWh బ్యాటరీ కలిగిన లాంగ్‌ రేంజ్‌ వేరియంట్ 622 కిలోమీటర్లు వెళుతుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. రూ.22 వేలు చెల్లించి రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం నాన్-రిఫండబుల్‌. 

తక్కువ ధరలో విన్‌ఫాస్ట్‌

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ ఆగస్టులో వీఎఫ్‌6, వీఎఫ్‌7 మోడళ్లను లాంచ్‌ చేయనుంది. రూ.21 వేలు చెల్లించి కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ మొత్తం రిఫండబుల్‌. టెస్లా తన కార్లను దిగుమతి చేసుకుంటుండగా.. విన్‌ఫాస్ట్‌ మాత్రం తమిళనాడులో 2 బిలియన్‌ డాలర్లు వెచ్చించి తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. అంతేకాదు దేశవ్యాప్తంగా చిన్నా, పెద్ద నగరాల్లో షోరూమ్‌లు తెరుస్తోంది. 

విన్‌ఫాస్ట్‌ వీఎఫ్‌ 6 ధర రూ.18 నుంచి రూ.24 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఇది 59.6 kWh బ్యాటరీ ఆప్షన్‌తో వస్తోంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 440 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. ఇక వీఎఫ్‌7 అనేది మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ. దీని ధర రూ.30-35 లక్షలు ఉండొచ్చు. ఇందులో 75.3kWh బ్యాటరీ ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  ఇది కూడా లెవల్‌ 2 అడాస్‌ ఫీచర్లతో అతిపెద్ద టచ్‌స్క్రీన్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీస్‌ వంటి ఫీచర్లతో రాబోతోంది. ఇవికాకుండా టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలతో పాటు బీఎండబ్ల్యూ, బీవైడీ, వంటి కార్ల నుంచి టెస్లాకు గట్టి పోటీ ఉండబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు