Time bank Care Scheme: టైమ్‌ బ్యాంక్‌.. వృద్ధులకు అండగా వినూత్న ప్రాజెక్ట్‌

Eenadu icon
By Business News Team Published : 03 Nov 2025 00:16 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వృద్ధుల కోసం సపోర్ట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేసే దిశగా కేరళ డెవలప్మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజిక్‌ కౌన్సిల్‌ (K-DISC) వినూత్న ఆలోచన చేసింది. తలస్సేరి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులతో కలిసి ‘టైమ్‌ బ్యాంక్‌’ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. దీని ద్వారా సాయం అవసరమైన లేదా ఒంటరిగా ఉన్న వృద్ధులకు సేవలందించవచ్చు. ఈ సేవల్లో భాగంగా ఇంటిపనులు, వంట, తోటపనులు, షాపింగ్‌, ఆస్పత్రికి తీసుకెళ్లడం, వారికి కంపెనీ ఇవ్వడం వంటివి చేయొచ్చు. వాలంటీర్లుగా వృద్ధులకు సాయం చేసిన వారు తమ సేవా సమయాన్ని టైమ్‌ బ్యాంక్‌లో జమ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో తమకు సాయం కావాల్సినపుడు ఆ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ స్థానిక పంచాయతీ పరిధిలో పైలట్‌ దశలో అమలులోకి తీసుకొచ్చారు.

తలస్సేరి ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ఈ సిస్టమ్‌ కోసం వెబ్‌సైట్‌ను డెవలప్‌ చేశారు. అనుబంధ యాప్‌ కూడా అందుబాటులో ఉంది. వృద్ధులు తమ పేరు, ఇమెయిల్‌, ఫోన్‌ నంబర్, చిరునామా వంటి వివరాలతో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. వారికి కావలసిన సేవను ఎంచుకుని సమయం, తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. అత్యవసర కాల్‌ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. తర్వాత సమీపంలో అందుబాటులో ఉన్న వాలంటీర్ల జాబితాను సిస్టమ్‌ చూపిస్తుంది. ఒకరిని ఎంచుకున్న తర్వాత వారికి రిక్వెస్ట్‌ వెళ్తుంది. ఒక క్లిక్‌తో సమీపంలోని పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌కు సమాచారం చేరి, వెంటనే సాయం అందుతుంది. వాలంటీర్లు తమ సేవా సమయాన్ని వెబ్‌సైట్లో నమోదు చేసుకోవచ్చు. వారు పొందే టైమ్‌ క్రెడిట్లు (టైమ్‌ డాలర్లు) ద్వారా భవిష్యత్తులో తాము సేవలు పొందవచ్చు. వృద్ధుల్లో ఒంటరితనాన్ని తగ్గించి, సామాజిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్‌ దోహదపడుతుంది. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం 21 పంచాయతీల్లో పైలట్‌ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి.

-ఈటీవీ భారత్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు