TRAI rules: టెల్కోలకు గడువు పొడిగించిన ట్రాయ్‌

Eenadu icon
By Business News Team Published : 30 Aug 2024 20:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

TRAI rules | దిల్లీ: స్పామ్‌ సందేశాల నివారణకు ట్రాయ్‌ (TRAI) తీసుకొచ్చిన కొత్త నిబంధనల గడువును సడలించింది. వైట్‌ లిస్ట్‌ చేయని ఎస్సెమ్మెస్‌ వెబ్‌లింక్‌లను నిలిపివేయాలని ఇప్పటికే ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..  సందేశాల వెరిఫికేషన్‌ కోసం గడువు అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటన జారీ చేసింది.

వైట్‌లిస్ట్‌ చేయని, యూఆర్‌ఎల్స్‌, ఏపీకే, ఓటీటీ లింక్స్‌, ఫోన్‌ నంబర్లతో కూడిన సందేశాలను నిలిపివేయాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం సెప్టెంబర్‌ 1 వరకు గడువు ఇచ్చింది. ఆగస్టు 31 లోగా తమ మెసేజ్‌ టెంప్లేట్స్‌, కంటెంట్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలని ఆయా సంస్థలకు సూచించింది. అయితే దీనిపై టెలికాం సంస్థలు గడువును పెంచాలని అభ్యర్థించాయి. దీంతో తాజాగా గుడువు పెంచుతున్నట్లు ట్రాయ్‌ వెల్లడించింది. అక్టోబర్‌ 1 తర్వాత ఇలాంటి సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

ముఖ గుర్తింపుతో పేమెంట్‌.. స్మైల్‌పే ప్రారంభించిన ఫెడరల్‌ బ్యాంక్

ఎస్సెమ్మెస్‌ హెడ్డర్‌, కంటెంట్‌ టెంప్లేట్స్‌ దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు ట్రాయ్‌ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్త రూల్స్‌ ప్రకారం.. బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ)కి టెలికాం కంపెనీలు మారాలి. అంటే ప్రతి ఒక్క కమర్షియల్‌ మెసేజ్‌ను చదవాలి. రికార్డులకు అనుగుణంగా లేనివాటిని బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు