ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. 10 మంది దుర్మరణం

రోడ్డుపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టిన ఘటనలో పది మంది దుర్మరణం చెందారు.

Published : 17 Apr 2024 19:08 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌- వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగివున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు. కారు వడోదర నుంచి అహ్మదాబాద్‌ వైపు వెళ్తుండగా  ఖేదా జిల్లాలోని నాడియాడ్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. రోడ్డు పక్కన నిలిపిఉన్న ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..  ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు విడిచినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై నాడియాడ్‌ ఎమ్మెల్యే పంకజ్‌ దేశాయ్ స్పందించారు.  సాంకేతికలోపం కారణంగా ట్రక్కు ఎక్స్‌ప్రెస్‌వే ఎడమ లేన్‌లో ఆగిపోయి ఉండొచ్చని కారు డ్రైవర్‌కు బ్రేకులు వేసేందుకు తగినంత సమయం లభించకపోవడంతో ఢీకొట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో  కారు నుజ్జునుజ్జయింది.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు