iPhones: విమానాశ్రయంలో 57 ఐఫోన్లు, బంగారం సీజ్‌

షార్జా నుంచి అమృత్‌సర్‌కు విమానంలో చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి పెద్ద సంఖ్యలో ఐఫోన్లను అధికారులు సీజ్‌ చేశారు.

Updated : 16 Aug 2023 19:49 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద సంఖ్యలో ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి అమృత్‌సర్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి 57ఐఫోన్లు, 490 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారు. ఆగస్టు 15 రోజున ఇద్దరు ప్రయాణికులను అడ్డుకొని తనిఖీ చేయగా.. ఒకరి నుంచి 29 ఐఫోన్లు 245 గ్రాముల బంగారం, మరో వ్యక్తి నుంచి 28 ఐఫోన్లు, 245 గ్రాముల బంగారం గొలుసు, ఉంగరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. వీటి మార్కెట్‌ విలువ రూ.94.83లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని