Fire accident: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం.. పరిశ్రమ మేనేజరు సహా ఐదుగురి మృతి

సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 03 Apr 2024 22:10 IST

హత్నూర: సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ గ్రామ శివారులో ఉన్న ఎస్‌బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో ఆయిల్‌ బాయిలర్‌ పేలి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పరిశ్రమ మేనేజర్‌ రవితో పాటు నలుగురు బిహార్‌ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 60 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. వీరిలో 15 మంది బాయిలర్‌ వద్దే పనిచేస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సంగారెడ్డి, హైదరాబాద్‌లో  ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి ఎస్పీ రూపేశ్‌, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునితా రెడ్డి, మెదక్‌ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.

పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి..

ఎస్‌బీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం.. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని