Visakhapatnam: కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల కేసు

గిరిజన మహిళ (56) ఫిర్యాదు మేరకు విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌పై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

Published : 30 May 2024 04:42 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: గిరిజన మహిళ (56) ఫిర్యాదు మేరకు విశాఖ కింగ్‌ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌) పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌పై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి విశాఖ ఒకటో పట్టణ పోలీసుల చుట్టూ తిరిగితే రాత్రి 11 గంటలకు కేసు నమోదు చేశారని బాధితురాలు ఆవేదన చెందారు. గత నెల వరకు కేజీహెచ్‌లో నర్సింగ్‌ విభాగంలో పని చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌ నోడల్‌ ఆఫీసరుగా అశోక్‌కుమార్‌ పనిచేసినప్పటి నుంచి నన్ను ఇబ్బందులకు గురిచేసేవారు. 2023 జనవరిలో ఆయన ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిగా వచ్చారు. అప్పటి నుంచి లైంగికంగా వేధించేవారు. నాపదోన్నతికి అవసరమైన పత్రాలనూ ఇవ్వకుండా జాప్యం చేశారు’’ అని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో డీఎంఈ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం డాక్టర్‌ అశోక్‌కుమార్‌ను సెలవుపై వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. అశోక్‌కుమార్‌ నెలరోజులు సెలవుపై వెళ్తూ బుధవారం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునను కలిసి తనపై ఆరోపణలు, కేసు నమోదు విషయాలూ వివరించినట్లు సమాచారం. మరోవైపు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఐ.వాణి బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని