MLA Lasya Nandita: లాస్య నందిత కారు డ్రైవర్‌ ఆకాశ్‌పై కేసు నమోదు

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్‌ ఆకాశ్‌పై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 23 Feb 2024 19:02 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(37) శుక్రవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎమ్మెల్యే సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు డ్రైవర్‌ ఆకాశ్‌పై సెక్షన్‌ 304ఏ కింద కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు.

ఏం జరిగిందంటే?

‘‘నిన్న సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్య నందిత శుక్రవారం ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయల్దేరారు. శామీర్‌పేట వద్ద కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పైకి చేరుకుంది. మరి కొద్దిసేపట్లో ఓఆర్‌ఆర్‌ నుంచి ఎగ్జిట్‌ అవుదామనుకున్న సమయంలో.. సుల్తాన్‌పూర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తోన్న టిప్పర్‌ను ఢీకొంది. ఆపై నియంత్రణ కోల్పోయి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం పటాన్‌చెరు పీఎస్‌ పరిధిలోనే జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తలకు బలమైన గాయం, ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. పీఎంని వీడియోగ్రఫీ చేశాం. పోస్టు మార్టం నివేదిక వచ్చేందుకు సమయం పడుతుంది’’ అని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని