కాకినాడ రైల్వే స్టేషన్‌లో వైద్య విద్యార్థిని దుర్మరణం

నగరంలోని రైల్వేస్టేషన్‌లో రైలు దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని మృతి చెందింది.

Updated : 10 Aug 2023 22:36 IST

కాకినాడ టౌన్‌ :  ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడి వైద్య విద్యార్థిని దుర్మరణం పాలైన ఘటన గురువారం ఉదయం కాకినాడ రైల్వే స్టేషన్లో జరిగింది. కాకినాడ జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన ఎస్‌.సత్య తనూష(24) గుంటూరు జిల్లా చినకాకాని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతోంది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఈనెల 10 నుంచి మూడు రోజుల పాటు సదస్సు ఉండటంతో పాల్గొనేందుకు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ చేరుకుంది.

రెండో నంబరు ప్లాట్‌ఫాం వద్ద రైలు దిగేందు సిద్ధమవుతుండగా పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. రైలు పోర్టు రైల్వేస్టేషన్‌ వైపు నెమ్మదిగా కదలడంతో.. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు, ప్రయాణికులు గట్టిగా కేకలు వేసి చైన్‌లాగారు. వెంటనే రైలు ఆగినప్పటికీ.. అప్పటికే ప్లాట్‌ఫాం, రైలు చక్రాల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని