Crime news: ₹10లు హుండీలో వేసి.. ₹5వేలు కాజేశాడు!

 హరియాణాలోని రేవారీ జిల్లాలో ఓ వ్యక్తి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. రూ.10 దేవుడికి విరాళం ఇచ్చి రూ.5 వేలు కాజేశాడు.

Published : 12 Jul 2023 02:06 IST

చండీగఢ్‌: హరియాణాలోని రేవారీ జిల్లాలో ఓ వ్యక్తి ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధరుహెరా పట్టణంలోని హనుమాన్‌ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతాయి. దొంగతనం జరిగిన రోజు కూడా యథావిధిగా పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి గుడి తాళాలు వేసి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం గుడి తెరిచేసరికి  హుండీ తాళం పగలగొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలను చూసి అవాక్కయ్యారు.

అసలు ఏమైందంటే...

చోరీ జరిగిన రోజు పూజలు జరుగుతున్న సమయంలో దొంగ కూడా అక్కడికి వచ్చాడు. అందరితో పాటు కూర్చుని హనుమాన్‌ చాలీసాను పఠించాడు. అనంతరం దేవుడికి రూ. 10 కానుకను హుండీలో వేశాడు. భక్తులంతా వెళ్లిపోయాక అదను చూసి ఆలయంలోకి ప్రవేశించాడు. విరాళాల హుండీని పగలగొట్టి, అందులో నుంచి రూ. ఐదు వేలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని ప‌ట్టుకునేందుకు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని