Hyderabad: ఓ చేత్తో బీరు సీసా, మరో చేత్తో సిగరెట్‌.. నాగోలులో యువతి హల్‌చల్‌

నాగోలులో శుక్రవారం ఉదయం ఓ యువతి మద్యం మత్తులో హల్‌ చల్‌ చేసింది.

Updated : 24 May 2024 22:20 IST

హైదరాబాద్‌: నాగోలులో శుక్రవారం ఉదయం ఓ యువతి మద్యం మత్తులో హల్‌ చల్‌ చేసింది. స్థానిక ఫతుల్లాగూడ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు కారులో వచ్చి నడిరోడ్డుపై బహిరంగంగా  మద్యం సేవిస్తూ కనిపించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన వారు హెచ్చరించారు. దీంతో వారిద్దరూ వాకర్స్‌పై ఎదురుతిరిగారు. కారును వేగంగా నడుపుతూ భయాందోళనకు గురి చేశారు. పోలీసులకు ఫోన్‌ చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. అడ్డుకుని దుర్భాషలాడారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేలోపే యువతి, యువకుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ తతంగాన్ని కొందరు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన నాగోలు పోలీసులు.. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువతి, యువకుడిని గుర్తించి అరెస్టు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు