Abdullapurmet: నవీన్‌ హత్య కేసు.. జైలు నుంచి నిహారిక విడుదల

బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసులో ఏ3 నిందితురాలిగా ఉన్న హరిహరకృష్ణ స్నేహితురాలికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది.

Updated : 19 Mar 2023 13:47 IST

రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో జరిగిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితురాలు నిహారికకు బెయిల్‌ మంజూరైంది. ఈకేసులో ఏ3గా ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక జైలు నుంచి విడుదలైంది. 

నవీన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణకు సహకరించినందుకు అతడి స్నేహితుడు హసన్‌, ప్రేమించిన యువతి నిహారికను పోలీసులు నిందితులుగా చేర్చి మార్చి 6వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హత్య గురించి తనకు హరిహరకృష్ణ చెప్పినా పోలీసులు సహా ఎవరికీ సమాచారం ఇవ్వకపోవడం.. హత్యానంతరం ఇద్దరి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు, సందేశాలను తొలగించి సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినందుకు యువతిని నిందితురాలిగా చేర్చి అరెస్టు చేశారు. అనంతరం నిందితులిద్దర్నీ హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఇటీవల నిహారిక బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. శనివారం ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి ఆదివారం విడుదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని