ACB: ఏసీబీ వలలో చిల్లకల్లు ఎస్సై దుర్గా ప్రసాద్‌

 అక్రమబొగ్గు రవాణా కేసులో నిందితులను తప్పించేందుకు ఓ కానిస్టేబుల్‌ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

Updated : 22 May 2023 22:33 IST

పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్‌ జిల్లా చిలకల్లు పోలీస్‌ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేసి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌లో గతంలో నమోదైన అక్రమ బొగ్గు రవాణా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసుపై గత నెల రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు కేసు నుంచి తప్పించుకునేందుకు ఎస్సై దుర్గా ప్రసాద్‌కు రూ. 5 లక్షల లంచం ఆశ చూపారు. సోమవారం రాత్రి దీనికి సంబంధించిన రూ. 3 లక్షల నగదును చిల్లకల్లు టోల్‌గేటు వద్ద సదరు వ్యక్తుల నుంచి కానిస్టేబుల్ సునీల్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని నేరుగా స్టేషన్‌కు వెళ్లారు. లంచం గురించి ఎస్సైని విచారించి నివేదిక తీసుకున్నారు. ఉన్నతాధికారులు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంతకుముందే మరో రూ.2 లక్షలను ఎస్సైకి అందజేసినట్లు బాధితులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని