సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు

సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్‌నగర్‌లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు.

Updated : 21 May 2024 12:16 IST

హైదరాబాద్: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు చేపట్టింది. అశోక్‌నగర్‌లోని ఇంటితో సహా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఆయనకు ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వీసు రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లోని 6 చోట్ల, మిగతా 4 ప్రాంతాల్లో దాడులు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ అనిశా దాడులు చేసింది.  ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉన్నారు. ఆయన గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు