Telangana ACB: సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అనిశా కస్టడీలోకి తీసుకుంది. 

Published : 29 May 2024 10:40 IST

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఏసీబీ కోర్టు విచారించింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటే అక్రమాస్తుల వివరాలన్నీ బయటపడే అవకాశం ఉందని, 10 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. ఈ క్రమంలో న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో బుధవారం ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు ఉమామహేశ్వరరావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును గతవారం అదుపులోకి తీసుకున్న అధికారులు.. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు