Crime news: రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్‌ ఉద్యోగి అరెస్ట్‌

అమెజాన్‌ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. రాజీనామా చేసిన ఉద్యోగులకు అందాల్సిన సొమ్మును కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 21 May 2024 19:43 IST

హైదరాబాద్‌: అమెజాన్‌ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. రాజీనామా చేసిన ఉద్యోగులకు అందాల్సిన సొమ్మును కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎం.వెంకటేశ్వర్లు అమెజాన్‌లో సీనియర్‌ ఫైనాన్షియల్‌ అనలిస్టుగా పని చేస్తున్నాడు. రాజీనామా చేసిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపులను ఆసరాగా తీసుకొని ఆ సంస్థలో మోసానికి పాల్పడ్డాడు. 184 మంది పేరిట నకిలీ అభ్యర్థనలు పెట్టి రూ.3.22 కోట్లు స్వాహా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ మొత్తాన్ని తన బంధువులు, స్నేహితులకు చెందిన 50 బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు. ఈ అవకతవకలను గుర్తించిన అమెజాన్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సైబరాబాద్‌ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని