Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మరో అగ్ని ప్రమాదం

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో 40 బోట్లు అగ్నికి ఆహుతైన ఘటన మరువక ముందే హార్బర్‌లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

Published : 30 Nov 2023 21:47 IST

విశాఖపట్నం: నగరంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో గురువారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హార్బర్‌లోని గాంధీ విగ్రహం వద్ద మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 40కిపైగా బోట్లు కాలి బూడిదైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు