Vizag: విశాఖలో గ్యాస్‌ లీక్‌ ఘటన.. చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి

విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

Published : 29 Nov 2023 11:42 IST

మధురవాడ: విశాఖ నగరం మధురవాడ వాంబే కాలనీలో ఐదు రోజుల క్రితం జరిగిన గ్యాస్‌ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ మృతి చెందారు. వై.బాలరాజు(60), అతడి భార్య చిన్ని(55), పెద్దకుమారుడు గిరి(22) బుధవారం తెల్లవారుజామున చనిపోగా.. చిన్నకుమారుడు కార్తిక్‌ (21) రెండు రోజుల క్రితమే మృతి చెందాడు.

ఇంట్లో వంటగ్యాస్‌ సిలిండర్‌కు రెగ్యులేటర్‌ను అమర్చే క్రమంలో గ్యాస్‌ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో వాంబే కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత  గాయాలతో ఆసుపత్రికి వెళ్లిన వీరంతా మృతి చెందడం బాధాకరమని కాలనీవాసులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని