ప్రభుత్వ న్యాయవాదుల సమావేశంలో అపశ్రుతి.. గుండెపోటుతో ఏపీపీ మృతి

గుంటూరు వైద్యకళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ న్యాయవాదుల(పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల) సమావేశంలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Updated : 02 Mar 2024 23:14 IST

గుంటూరు: గుంటూరు వైద్యకళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి (ప్రభుత్వ న్యాయవాదుల)పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల సమావేశంలో అపశ్రుతి చోటు చేసుకుంది. విశాఖ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఏపీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. అడ్వకేట్ జనరల్ ఆధ్వర్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. విశాఖ నుంచి వచ్చిన ఏపీపీ గాయత్రి ఈ కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా  ఆమె ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని