Hyderabad: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. పీర్జాదిగూడలో ఉద్రిక్తత
పీర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడలో ఉన్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అందులోనే క్యూ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో మల్లన్న కార్యాలయంలో లేరు. దాడి అనంతరం సిబ్బంది, ఆయన అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కార్యాలయాన్ని పరిశీలించారు. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ఏడు మ్యాచ్లు.. భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష
-
India News
Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్.. నేడు శాన్ఫ్రాన్సిస్కో
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు
-
India News
Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?
-
India News
Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్పై కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. సోషల్ మీడియాలో పోస్ట్