Hyderabad: బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో 432 ఫోన్లు చోరీ.. కేసును ఛేదించిన పోలీసులు

గత నెల 21న నగరంలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన చోరీ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు.

Updated : 06 Oct 2022 12:58 IST

హైదరాబాద్‌: గత నెల 21న నగరంలోని ఈసీఐఎల్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌లో జరిగిన చోరీ కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మొత్తం రూ.70లక్షల విలువైన 432 మొబైల్‌ ఫోన్లను దుండగులు చోరీ చేసినట్లు ఘటన తర్వాత బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ స్టోర్‌ మేనేజర్‌ పోలీసుల ఫిర్యాదు చేశారు. వీటిలో ఐఫోన్‌, ఒప్పో, వన్‌ప్లస్‌, వివో బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు.. ఝార్ఖండ్‌కు చెందిన షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది.

చోరీ చేసిన స్మార్ట్‌ఫోన్లను నిందితులు బంగ్లాదేశ్‌కు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బంగ్లాదేశ్‌ సరిహద్దుకు 3 కి.మీ దూరంలో నివసించే ముఠా ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బ్యాంకులు, మొబైల్‌ షాపులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ నుంచి రెండు మొబైల్‌ఫోన్లు, రూ.80వేల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని