Rave Party: సినీనటి హేమకు మరోసారి నోటీసులు

బెంగళూరు నగర శివారులోని జీఆర్‌ ఫాంహౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీనటి హేమకు సీసీబీ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు.

Published : 30 May 2024 05:32 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: బెంగళూరు నగర శివారులోని జీఆర్‌ ఫాంహౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పాల్గొని మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు సినీనటి హేమకు సీసీబీ పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేశారు. గత సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు మొదటిసారి నోటీసులు ఇచ్చారు. తనకు జ్వరంగా ఉందని, విచారణకు హాజరయ్యేందుకు ఒక వారం సమయం కావాలని ఆమె కోరారు. దీంతో జూన్‌ 1న విచారణకు రావాలని బుధవారం మరో నోటీసును ఆమెకు పంపించారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేరిట స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చిన వ్యక్తులకూ నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు