గన్‌పౌడర్‌ పరిశ్రమలో పేలుడు.. ఒకరి మృతి, కుప్పకూలిన రెండంతస్తుల భవనం

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ (Explosives Factory)లో పేలుడు సంభవించింది.

Updated : 25 May 2024 21:01 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెమెతరా జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ (Explosives Factory)లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం కుప్పకూలిందని, దాని కింద కొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

రోజు మాదిరిగానే పిర్దాలోని ‘స్పెషల్‌ బ్లాస్ట్స్‌ లిమిటెడ్‌’కు వచ్చిన కూలీలు తయారీ పనులు మొదలుపెట్టిన కాసేపటికే ఈ ప్రమాదం (Blast) చోటుచేసుకుంది. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి నేలపై 40 అడుగుల బిలం ఏర్పడింది. ప్రమాదం కారణంగా పరిశ్రమ వద్ద దట్టమైన పొగ అలుముకుంది. దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో దీని ప్రభావం కనిపించిందని ఆ ప్రాంతంలోని దుకాణదారులు తెలిపారు.

బెమెతరా జిల్లా కలెక్టర్‌ రణ్‌బీర్‌ శర్మ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగించడంలో నిమగ్నమయ్యాయని, ఆ తర్వాత మృతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావో.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని