Manyam district: పెళ్లైన కొన్ని గంటల్లోనే కన్నుమూసిన వధువు

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

Updated : 30 Mar 2024 16:43 IST

మక్కువ: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు అఖిల (20) మృతి చెందింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు అఖిలకు వివాహమైంది. వివాహ క్రతువు ముగిసిన తర్వాత నీరసంగా ఉందని నిద్రలోకి జారుకుంది. బంధువులు పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మక్కువ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నవవధువు మృతి చెందినట్లు నిర్ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని