Crime news: పటాన్‌చెరులో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బీభత్సం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బీభత్సం సృష్టించింది.

Published : 13 Apr 2024 22:49 IST

పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బీభత్సం సృష్టించింది. నోవాపాన్‌ కూడలి సమీపంలో పటాన్‌చెరు నుంచి సంగారెడ్డివైపు వెళ్తోన్న ట్రావెల్‌ బస్సు అదపుతప్పి కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి డివైడర్‌పైకెక్కి ఆగింది.  అదే సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మృతుడు వనపర్తి జిల్లా రాజాపూర్‌నకు చెందిన కార్మికుడు మహేశ్‌గా గుర్తించారు. ద్విచక్రవాహన దారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రాకపోకలు క్రమబద్ధీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని