Sangareddy: కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

Updated : 02 Dec 2023 10:47 IST

జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు.. కారు, గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు పోలీసులు వివరించారు. వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని