actor Jagdish: ‘పుష్ప’ నటుడు జగదీశ్‌ను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

‘పుష్ప’లో అల్లు అర్జున్‌ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్‌ (కేశవ)ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated : 06 Dec 2023 18:18 IST

పంజాగుట్ట: ‘పుష్ప’లో అల్లు అర్జున్‌ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్‌ (కేశవ)పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ జూనియర్‌ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్‌ ఆర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు