Nizamabad: 13 ఏళ్ల బాలికకు.. 42 సంవత్సరాల వ్యక్తితో పెళ్లి

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

Updated : 09 Jul 2023 10:40 IST

నవీపేట: నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, అధికారులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బాలిక(13)కు, ఫకీరాబాద్‌కు చెందిన సాహెబ్‌రావు (42) అనే వ్యక్తితో వివాహం జరిపారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి సాహెబ్‌రావు బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. 

ఈ క్రమంలో పెళ్లి అడ్డుకునేందుకు వచ్చిన అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. డీసీపీవో చైతన్య కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం తండాకు వెళ్లి విచారణ చేపట్టారు. బాల్య వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు పెళ్లికి సహకరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి హైమద్‌ నవీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. చైల్డ్‌హెల్ప్‌లైన్‌ ప్రాజెక్టు సమన్వయకర్త జోత్స్న దేవి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు శోభ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని