Crime: ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు

చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.

Published : 23 Apr 2024 14:33 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన ఓ మహిళ(31) అగ్నిపర్వతం అంచున ఫొటో తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించిన ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం చైనాకు చెందిన హువాంగ్ లిహోంగ్ అనే మహిళ తన భర్తతో కలిసి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. శనివారం వారు సూర్యోదయాన్ని చూడడానికి అగ్నిపర్వత పర్యాటక పార్కు అయిన ఇజెన్‌కు వెళ్లారు. అనంతరం మహిళ అగ్నిపర్వతం అంచున నిలబడి ఫొటోలకు పోజులిస్తుండగా ప్రమాదవశాత్తూ కాలు జారి 75 మీటర్ల ఎత్తు నుంచి అందులో పడి మరణించారు. మహిళను బిలం అంచులకు వెళ్లవద్దని వారించినప్పటికీ ఆమె పట్టించుకోలేదని, ఫొటో తీసుకుంటున్న క్రమంలో తన పొడవైన డ్రెస్‌కు ఆమె కాళ్లు తగలడంతో ముందుకుపడిపోయారని టూర్‌ గైడ్‌ అధికారులకు తెలిపారు.

ఇండోనేషియా అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఇక్కడి ఇజెన్ అగ్నిపర్వతం సల్ఫ్యూరిక్ ఆసిడ్‌ నుంచి వెలువడే ‘‘బ్లూ ఫైర్’’కి ప్రసిద్ధి చెందింది. 2018లో ఈ అగ్నిపర్వతం విషపూరిత వాయువులను విడుదల చేస్తుండడంతో అక్కడి ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే ఇది తక్కువ మొత్తంలో హానికరమైన వాయువులను విడుదల చేస్తుండడంతో పర్యటకులను సందర్శనకు అనుమతినిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు