Hyderabad: మొబైల్‌ వాడకంపై తల్లి మందలింపు.. కుమార్తె ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ వాడొద్దని తల్లి చెప్పిందని కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్‌ బషీరాబాద్‌లో చోటు చేసుకుంది.

Updated : 06 Feb 2023 20:55 IST

కుత్బుల్లాపూర్‌: సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడొద్దని తల్లి మందలించిందని ఓ కూతురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ధూళపల్లి గ్రామానికి చెందిన మూర్తి కుమార్తె సాధన (17) మొబైల్‌ ఎక్కువగా వాడుతోందని ఆమె తల్లి మందలించింది. దీంతో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో  గదిలోకి వెళ్లిన ఆమె.. ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు గమనించి దగ్గర్లోని ఆస్పత్రికి తరలిచంగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని