రైల్లో వివాదం.. ఇద్దరిపై చాకుతో దాడి.. పరిస్థితి విషమం

గాంధీ ధామ్‌- పూరి ధామ్‌ రైళ్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్న వారి మధ్య గురువారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 

Updated : 15 Sep 2023 10:06 IST

కటక్‌: గాంధీ ధామ్‌- పూరి ధామ్‌ రైళ్లో ఒకే బోగీలో ప్రయాణిస్తున్న వారి మధ్య గురువారం రాత్రి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ కొట్లాటలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి. చంద్రశేఖర్‌రావు, అతడి స్నేహితుడు బ్రహ్మపురానికి చెందిన నాగేశ్వర బెహరాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరినీ ఒడిశాలోని బలంగిర్‌ జిల్లా టిటిలాగాడ్‌ రైల్లే స్టేషన్‌లో దింపేసి.. రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ స్నేహితులిద్దరూ రైల్లో ఏదో విషయంపై ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దంపతులు చాగల నాయక్‌, వినతి నాయక్‌లోమ గొడవపడ్డారు. దీంతో దంపతులిద్దరూ ఆగ్రహంతో వారి దగ్గరున్న చాకుతో వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారిద్దరి గొంతులపై తీవ్ర గాయాలయ్యాయి. బోగీలో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించడంతో క్షతగాత్రులను తొలుత టిటిలాగాడ్‌లోని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బలంగిర్ భీమా బోయి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని