రైస్‌మిల్లు వ్యాపారికి రిమాండ్‌

ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్‌మిల్లు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్‌ సీఐ జాన్‌వెస్లి తెలిపారు.

Published : 13 Apr 2024 06:53 IST

నర్సాపూర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్‌మిల్లు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సాపూర్‌ సీఐ జాన్‌వెస్లి తెలిపారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంటలోని వీరభద్ర ఇండస్ట్రీస్‌, మహాలక్ష్మీ రైస్‌ మిల్లుల యజమాని నోముల పాండురంగం రూ.44.56 కోట్ల విలువైన ధాన్యం బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. ధాన్యాన్ని మరాడించి సీఎంఆర్‌ కింద బియ్యం తిరిగి ఇవ్వలేదన్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ హరికృష్ణ ఫిర్యాదు మేరకు పాండురంగంపై మోసం, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసునమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని