Hyderabad: కొకైన్‌ పార్శిల్‌ వచ్చిందని బెదిరించి.. రూ.14.73లక్షలు కాజేశారు

నగరానికి చెందిన ఓ మహిళ ఫెడెక్స్‌ మోసానికి బలైంది.

Published : 25 May 2024 19:59 IST

హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ మహిళ సైబర్‌ నేరగాళ్ల మోసానికి బలైంది. ఆమె పేరుతో పార్శిల్‌లో 5కిలోల దుస్తులు, 7 నకిలీ పాస్‌పోర్టులు, 5 ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు, 960 గ్రాముల కొకైన్‌ వచ్చిందని సైబర్‌ నేరగాళ్లు బెదిరించారు. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ నుంచి మాట్లాడుతున్నామని.. బ్యాంకు ఖాతా వెరిఫై చేయాలని వివరాలన్నీ సేకరించారు. ఆ తర్వాత బాధితురాలి ఖాతా నుంచి రూ.14.73 లక్షలు కాజేశారు. దీంతో బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని