Tamilisai: తెలంగాణ గవర్నర్‌ ‘ఎక్స్‌’ ఖాతా హ్యాక్‌.. ఐపీ అడ్రస్‌ల గుర్తింపు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఎక్స్‌ ఖాతా (అంతకుముందు ట్విటర్‌) హ్యాకింగ్‌ కేసు దర్యాప్తును సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వేగవంతం చేశారు.

Published : 19 Jan 2024 20:45 IST

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan) ఎక్స్‌ ఖాతా (అంతకుముందు ట్విటర్‌) ఈనెల 14న హ్యాక్‌ అయిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇండియాలోని మూడు ఐపీ అడ్రస్‌ల నుంచి ఆపరేట్‌ అయినట్టు గుర్తించారు. హాత్‌వే, యాక్ట్‌ సహా మరో ఇంటర్నెట్‌ సర్వీసు ద్వారా గవర్నర్‌ ఖాతాను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించారని నిర్ధరించిన పోలీసులు.. ఐపీ అడ్రస్‌ల వివరాలు పంపాలని ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లను కోరారు. వివరాలు అందగానే నిందితులను పట్టుకుంటామని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని