Cyber Crime: మనీలాండరింగ్‌ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. 

Published : 18 May 2024 00:07 IST

సైబర్‌ నేరగాళ్ల కొత్త పంథా

హైదరాబాద్‌:  సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది వీరి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. మహారాష్ట్ర పోలీసులమంటూ సైబర్‌ నేరగాళ్లు ఆమెకు ఫోన్‌ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో మీ పేరుందని చెప్పి.. స్కైప్‌ ద్వారా వీడియో కాల్‌లో మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన ఖాతాకు రూ.60లక్షలు నగదు బదిలీ చేయాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే చేసిన తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు.. వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పందించి మొత్తం నగదును ఫ్రీజ్‌ చేశారు. వేగంగా స్పందించిన కాల్‌ సెంటర్‌ సిబ్బందిని అదనపు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని