హైదరాబాద్‌లో డేటింగ్‌ స్కాం: పబ్‌కు తీసుకెళ్లి.. భారీగా ఆర్డర్‌ చేసి..

నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్‌లో  పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలో ఓ పబ్‌కి తీసుకెళ్తున్నారు.

Updated : 07 Jun 2024 11:27 IST

హైదరాబాద్‌: నగరంలో డేటింగ్ స్కాం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్‌లో పరిచయమవుతున్న యువతులు.. యువకులను హైటెక్ సిటీలోని ఓ పబ్‌కి తీసుకెళ్తున్నారు. అక్కడ ఖరీదైన మద్యం, ఇతర ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి యువతులు జారుకుంటున్నారు. ఇప్పటి వరకూ 8 మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది.

టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లో పరిచయం అవుతున్న యువతులు.. వెంటనే వాట్సాప్ ద్వారా కలుద్దామని సందేశాలు పంపుతున్నారు. యువకులను మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న పబ్‌లోకి తీసుకెళ్తున్నారు. గంటలో రూ.40 వేల వరకూ బిల్ చేసి జారుకుంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బిల్ కట్టాలని యువకులపై పబ్‌ యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. పబ్‌ నిర్వాహకులు, యువతులు కలిసి ఈ స్కాంకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాము కూడా బాధితులమేనంటూ పలువురు ముందుకు వస్తున్నారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని