Crime news: తప్పతాగి తరగతి గదిలోనే నగ్నంగా పడకేసిన ప్రధానోపాధ్యాయుడు!

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో పాఠశాలకు వెళ్లాడు. దీంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు.

Published : 27 Jul 2023 02:12 IST

లఖ్‌నవూ : గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ బాధ్యతగా మెలగాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు (Head master) తప్పతాగి పాఠశాలకు వెళ్లాడు. అంతేకాదు తరగతి గదిలోనే సోయి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం బహ్రైచ్‌ జిల్లాలోని శివపుర్‌ బైరాగి ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశేశ్వరగంజ్‌ బ్లాక్‌లోని శివపుర్‌ బైరాగి ప్రాథమిక పాఠశాలలో దుర్గా ప్రసాద్‌ జైశ్వాల్ అనే వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులు క్రితం అతడు ఫూటుగా మద్యం సేవించి పాఠశాలకు వెళ్లాడు. దుస్తులన్నీ విప్పేసి విద్యార్థుల ముందే నగ్నంగా నిద్రపోయాడు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తనను కొందరు గ్రామస్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్‌గా మారింది. తీరా ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రధానోపాధ్యాయుడి సస్పెండ్‌ చేశారు.

గొంతుకోసి.. కారంపొడి చల్లి.. మహిళా డాక్టర్‌ దారుణ హత్య

దుర్గా ప్రసాద్‌ జైశ్వాల్‌ అనుచిత ప్రవర్తన గురించి తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నిందితుడు తరచూ ఇలాగే చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ చేష్టలను భరించలేక కొందరు బాలికలు పాఠశాలకు వెళ్లడం మానేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బేసిక్‌ శిక్ష అధికారి (బీఎస్‌ఏ) ఉపాధ్యాయుడిపై విచారణకు ఆదేశించారు. వెంటనే బ్లాక్‌ విద్యాధికారి అతడిని సస్పెండ్ చేశారు. ‘దుర్గా ప్రసాద్‌పై మాకు ఫిర్యాదు అందింది. విశేశ్వరగంజ్‌ బ్లాక్‌లోని శివపుర్‌ బైరాగి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన అతడు మద్యం మత్తులో పాఠశాలకు వెళ్తున్నట్లు తెలిసింది. అనుచిత ప్రవర్తనకు సంబంధించిన వైరలవున్న వీడియోను ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రాథమిక విచారణ అనంతరం అతడిపై చర్యలు తీసుకున్నామని, అవసరమైతే పోలీసుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం’ అని బీఎస్‌ఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని