Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

సొంత అక్క తనను లైంగికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. మహారాష్ట్ర పుణె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2023 07:49 IST

సొంత అక్క తనను లైంగికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ యువతి. మహారాష్ట్ర పుణె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల అక్క ఉన్నత విద్యావంతురాలు. ఆమెకు వివాహం అయింది. 18 ఏళ్ల చెల్లి.. కొద్ది రోజులుగా అక్కతో పాటు విమానగర్‌ ప్రాంతంలో ఉంటోంది. ఈ నెల 23న చెల్లి హాలులో నిద్రిస్తోంది. సోదరి అక్కడకు వచ్చి చెల్లిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టింది. ఇది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా వినలేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన చెల్లి.. అక్కపై ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని