దళితుడితో చెప్పులు నాకించాడు.. యూపీలో విద్యుత్తు ఉద్యోగి దాష్టీకం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో విద్యుత్తుశాఖ ఒప్పంద ఉద్యోగి ఒకరు దళిత యువకుణ్ని దారుణంగా కొట్టి, అతడి చేత తన చెప్పులు నాకించడం రాజకీయ దుమారం రేపుతోంది.

Published : 10 Jul 2023 09:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో విద్యుత్తుశాఖ ఒప్పంద ఉద్యోగి ఒకరు దళిత యువకుణ్ని దారుణంగా కొట్టి, అతడి చేత తన చెప్పులు నాకించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ప్రభుత్వం నిందితుణ్ని సర్వీసు నుంచి తొలగించింది. వెంటనే అతణ్ని అరెస్టు కూడా చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. భాజపా పాలనలో దళితులను కనీసం మనుషులుగానూ చూడటం లేదంటూ ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ ధ్వజమెత్తారు. ‘నీచమైన చర్య’గా కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. భాజపా సర్కారు దళితులను అవమానిస్తోందంటూ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) పార్టీ దుయ్యబట్టింది. జులై 8న పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ‘‘జులై 6న బంధువుల ఇంటికి వెళ్లిన నేను అక్కడ విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని పరిశీలిస్తుండగా వచ్చిన తేజ్‌బలి సింగ్‌ పటేల్‌ కులం పేరుతో దుర్భాషలాడి చెప్పులు నాకించాడు’’ అంటూ తనపై జరిగిన దాడిని వివరించాడు. తేజ్‌బలి సింగ్‌ బాధితుడి చెయ్యి మెలిపెట్టి, అతడి ఛాతీపై నిలబడి కొడుతున్న దృశ్యాలు సైతం వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనపై యూపీ డీజీపీ స్పందించడంతో పోలీసులు శరవేగంగా కదిలారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని